బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల రక్షణ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మార్వో నందిని చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ సురేష్

Jun 8, 2026 - 19:48
 0  6

 జోగులాంబ గద్వాల 8జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్.: మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో, సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ సమావేశానికి ఎమ్మార్వో నందిని, చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ సురేష్ హాజరై బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల రక్షణ మరియు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన చర్యలు మరియు పిల్లల హక్కుల గురించి వివరంగా తెలియజేశారు. అలాగే దత్తత ప్రక్రియ, పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చైల్డ్‌లైన్ 1098 సేవలు మరియు పిల్లల సంరక్షణ వ్యవస్థపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సర్పంచి మున్నెప్ప, పంచాయతీ కార్యదర్శి మోహన్, గ్రామ పెద్దలు సారలమ్మ, ఏఈఓ కార్తీక్ మరియు జీపీఓ వెంటపతి నాయుడు, సీసీ వెంకటేశం మరియు అంగన్వాడీ టీచర్లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333