బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి నూకల సుదర్శన్ రెడ్డి

Apr 5, 2026 - 21:54
Apr 5, 2026 - 21:55
 0  2
బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి నూకల సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట, 05 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- మన దేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖల మంత్రివర్యులుగా సమర్థవంతంగా  నిర్వహించి మన దేశ అభివృద్ధి సంక్షేమం కోసం వారు చేసిన అమూల్యమైన సేవలు మరువలేమని సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి అన్నారు.

ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ కమిటీ పక్షాన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119 జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి.జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పలువురు న్యాయవాదులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హసేన్, ఉపాధ్యక్షులు పోలేబోయిన నరసయ్య, సహాయ కార్యదర్శి పసల బాలరాజు, సీనియర్ ఈసీ మెంబర్స్ వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు టి వేణుగోపాలరావు, భాగాల నరసింహ, ఊర గాయత్రి డేగల జనార్ధన్, స్పెషల్ పీపీ రఘురామయ్య, ఏజిపి దోరేపల్లి రమేష్, ఈసీ మెంబర్స్ బుక్కా సుజాత, మీసాల శ్రీనివాస్, మందుల శ్రీనివాస్, రాంపాక ఉప్పలయ్య , చిప్పలపల్లి చిరంజీవి సోమశేఖర్ , తరుణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333