బర్రెలు పొలంలో పడ్డాయాని దళిత మహిళను విచక్షణరహితంగా దాడి చేసిన శెట్టి ఆత్మకూరు విష్ణువర్ధన్ రెడ్డి 

May 28, 2025 - 20:51
 0  34
బర్రెలు పొలంలో పడ్డాయాని దళిత మహిళను విచక్షణరహితంగా దాడి చేసిన శెట్టి ఆత్మకూరు విష్ణువర్ధన్ రెడ్డి 

బాధితురాలు లక్ష్మి నీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు. 

 దాడిని తీవ్రంగా ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల ప్రకాష్

 జోగులాంబ గద్వాల 28 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. మండలం,  కొత్తపల్లి గ్రామానికి చెందిన దళితులు లక్ష్మి వారి భర్త  నరసింహులు  నిన్న వారి అక్క గ్రామమైన శెట్టి ఆత్మకూరు గ్రామానికి వెళ్లి బర్రెలు మెపడానికి వారి బంధువులతో  వెళ్లి  వీరు నిన్న సాయంత్రం అందాజా మూడు గంటల సమయంలో ఇంటికి తిరిగి పొలం నుంచి బర్రెలు  తీసుకు వస్తున్న సమయంలో  శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అయన పొలంలో బర్రెలు పడ్డాయనే నెపంతో  నర్సింహులు భార్య దళిత లక్ష్మి  నీ   విచక్షణ  రహితంగ దాడి చేసి మాదిగ లంజదానా అని కులం పేరుతో దూషించి ముఖంపై ఘోరంగా చేతులతో కొట్టడంతో నోట్లు ఉన్న పళ్ళు రెండు విరిగి పోయాయి, విపుల మీద దాడి చేయడంతో  ద్యాస లేకుండా పడిపోయింది విష్ణువర్ధన్ రెడ్డి గతంలో కూడా ఇలాగే దళితులతో గొడవపడేవాడు  అని బాధితులు వాపోయారు. దళితులని ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి అహంకారంతో కులం పొగరుతో  లక్ష్మీని ఘోరంగా దాడి చేయడన్ని తీవ్రంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ ఖండించారు, గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ కి  లక్ష్మీ భర్త నరసింహులు ఫిర్యాదు చేయడం జరిగింది ,  దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాచర్ల ప్రకాష్ అన్నారు , అదేవిధంగా గద్వాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీని నాగర్ దొడ్డి వెంకట రాములు  మాచర్ల ప్రకాష్  , వారి టీం  పరామర్శించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333