బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మెట్ పల్లి 11 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మంగళవారం మెట్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ ఆఫిస్ లో జువ్వాడి నర్సింగరావు ను పలు కుల సంఘాల నాయకులు కలిశారు.ఈ సందర్భంగా కుల సంఘాల భవనాలు, అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలో గ్రామాల్లో రోడ్లు , డ్రైనేజీలు, అభివృద్ధి చేపట్టిందన్నారు. అలాగే రైతుల సంక్షేమానికి రుణమాఫీ చేసిందని ,రైతు భరోసా మంజూరు చేసిందన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని , విశ్వసం తో కాంగ్రెస్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అడ్వకేట్ అల్లె రాము ను సన్మానించిన జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అల్లె రాము బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొంది కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు మంగళవారం అడ్వకేట్ అల్లె రాము ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టైగర్ ఆలీ నవాబ్ , మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరి లక్ష్మీరాజం ఉన్నారు.