ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వడ్డేపల్లిని ఆకస్మిక తనిఖీ జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప
పీహెచ్సీ రికార్డుల తనకి, డెలివరీలు పెంచాలని సూచన...
జోగులాంబ గద్వాల 13 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప ఈరోజు వడ్డేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు... పీహెచ్సీ నందు ఉన్న అన్ని రికార్డులను తనిఖీ చేశారు, డెలివరీ లపై ఆరా తీశారు నెల నెల డెలవరిల సంఖ్య పెంచాలని, హైరిస్క్ ప్రెగ్నెన్సీ మరియు ఈ నెలలో ఈడీడీలు ఉన్నవారిని తరచూ ఫాలోఅప్ చేయాలని తెలిపారు, అనంతరం పీహెచ్సీ నందు ఉన్న ఫార్మసీ, ఆన్లైన్లో ఈ ఔషధీ, ల్యాబ్, ప్రజలకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు, వర్షాలు పడుతున్న కారణంగా అప్రమత్తగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జె సంధ్యాకిరణమై, డాక్టర్ ప్రసూనారాణి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణ్ డి పీహెచ్ఎన్ఓ వరలక్ష్మి, డివిఎల్ఎం నరేంద్రబాబు, ఎన్ సి డి డి పి సి శ్యాంసుందర్ మరియు పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు.