ప్రశాంతంగా జరిగిన పోలింగ్

May 13, 2024 - 21:45
 0  16
ప్రశాంతంగా జరిగిన పోలింగ్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి..... పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చివరి ఘట్టం సోమవారం పోలింగ్ ఆత్మకుర్ ఎస్ మండలం లో ప్రశాంతంగా జరిగింది. మండలంలో ఎలర్జీ అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మండలంలోని నాలుగు రోడ్లలో సెక్టర్ ఆఫీసర్లను నియమించి ప్రశాంతంగా ఎన్నికల జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆత్మకూరు మండలంలో నీ గ్రామాల్లోని పాఠశాలల్లో బూతుల ఏర్పాటుచేసి ఓటర్లకు తగిన సౌకర్యాల ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 51 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో పోలింగ్ ఆఫీసర్లు 51 మంది ఏపీవోలు 51, opo లు 102 , బీ ఎల్ ఓ లు 51 మంది విధులు నిర్వర్తించారు. మండలంలో 6,14,15,16, నాలుగు సెక్టార్ల లో పర్యవేక్షణ చేశారు .6వ సెక్టార్ కు ఇరిగేషన్ డీ ఈ నగేష్,14 సెక్టార్ కు వ్యవసాయాధికారి దివ్య,15 సెక్టార్ కు zphs గట్టికల్ ప్రధానోపాధ్యాయులు వెంకట రమణ, 16వ సెక్టార్ కు ఇరిగేషన్ ఏఈ రామారావు లు సెక్టార్ అధికారులు గా విధులు నిర్వహించారు .గత నెల రోజులుగా వాతావరణం లో ఎండ వేడిమి ఉన్నప్పటికీ సోమవారం పోలింగ్ సందర్భంగా వాతావరణం చల్లబడింది .దాంతో ఓటర్లు హుషారుగా ఓటును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు మండలంలో 60% పైగా ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం తర్వాత మందకొడిగా పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలలో వరకు మండలంలో దాదాపుగా 70% పైగా ఓటింగ్ నమోదయింది.  పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మండలంలో ఓటింగ్ సరలిని పరిశీలించేందుకు బిజెపి నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, నిమ్మికల్ ,గట్టిగల్లు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అనంతరం నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.aicc నాయకులు అద్దంకి దయాకర్ తన స్వగ్రామం నెమ్మికల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పిసిసి నాయకులు సర్వోత్తమ్ రెడ్డి మండల కేంద్రంలోని నసీంపేట ఏపూర్,రామన్నగూడెం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు.