ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాలపై అవగాహన సదస్సు
జోగులాంబ గద్వాల జిల్లా కాకులవరం గ్రామంలో ఆపరేషన్ మెర్సి ఇండియా ఫౌండేషన్ ( ఓ ఎం ఐ ఎఫ్ ) ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ నారాయణ అధ్యక్షతన ప్రభుత్వ పథకాలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ముఖ్యంగా ప్రజలకు లేబర్ కార్డ్స్, సమృద్ధి సంయోజన ఇన్సూరెన్స్ గూర్చి వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో వాటి వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ ఎం డి రాజక్( ఓ ఎమ్ ఐ ఎఫ్ ) మండల కోఆర్డినేటర్స్ వి అనురాధ పౌల్ హెల్త్ వర్కర్స్ మరియు ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు.