ప్రధానోపాధ్యాయుడికి మండల టిఆర్ఎస్ నాయకులు ఘన సన్మానం

Apr 22, 2026 - 20:05
Apr 23, 2026 - 19:28
 0  10
ప్రధానోపాధ్యాయుడికి మండల టిఆర్ఎస్ నాయకులు ఘన సన్మానం

ప్రధాన ఉపాధ్యాయుడికి ఘన సన్మానం చిన్నంబావి మండల టిఆర్ఎస్ నాయకులు 

22-04-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిధిలోని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దళిత రత్న అవార్డు గ్రహీత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బచ్చలకూర స్వామినాధ్ ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దళిత రత్న అవార్డు గ్రహీత దేవని రమేష్‌ బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ జయ గౌడ్ సంపంగి మద్దిలేటి సంకటి మద్దిలేటి ఉగ్ర నరసింహ మాజీ ఉపసర్పంచ్ తగరం కురుమయ్య తో పాటు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేని దని. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని బీఆర్ఎస్ సీనియర్ అన్నారు. పదవీ విరమణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ మాట్లాడుతూ.. వీధి నిర్వహణలో భాగంగా అయ్యవారి పల్లి గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు. గ్రామస్తుల మన్ననలు పొందారని కొనియాడారు.విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు. అన్నారు. అంకితభావంతో పనిచేసిన బచ్చలకూర స్వామినాధ్ ని ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచించారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయ గౌడు తగరం బాలకిష్టి గోపాల్ జయ రాములు శివకృష్ణ నాగరాజు విష్ణు సింకిశాల పాండు అపోలో కృష్ణ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State