ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిధిగా బీజేపీ NRI సెల్ రాష్ట్ర కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, యువతకు ఉపాధిలాంటి పథకాలను అందిస్తూ, భారతదేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చిన ఆయన, దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పేదల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శక సూత్రాలని స్పష్టం చేశారు...
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుక్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నరసింహ, ఫణి, ఉపాధ్యక్షులు పాండురంగచారి, భిక్షమయ్య, కోశాధికారి నరేందర్రెడ్డి, జిల్లా పదాధికారులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు మన్మధరెడ్డి, కృష్ణయ్య, సాయిరెడ్డి, శ్రీను, పృద్వి, రవి తదితరులు పాల్గొన్నారు...