ప్రతి కార్మికునికి అండగా ఉంటా ఎమ్మెల్యే మందుల సామెల్

Sep 23, 2024 - 15:46
 0  517
ప్రతి కార్మికునికి అండగా ఉంటా ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నేడు హమాలీ, దడ్వాయి మరియు స్వీపర్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు హాజరై హమాలీ 285, దడ్వాయి 26, స్విపర్ 76 మందికి  దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దుతా మరియు మార్కెట్లో పనిచేసే ప్రతి కార్మికునికి ప్రమాదవశాత్తు బీమా ఐదు లక్షల రూపాయలు హెల్త్ కార్డు అందజేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీధర్,సంకేపల్లి నరసింహారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ చాగంటి అనసూయ రాములు మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ మూల అశోక్ రెడ్డి గిలి కత్తుల ప్రియలత రాములు గౌడ్ పాలకుర్తి రాజయ్య బత్తుల శ్రీను పేరాల వీరేష్ కందుకూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034