ప్రతి ఇంట్లో అందరూ విష జ్వరాలతో అనారోగ్య పాలైన గ్రామ ప్రజలు
గోపాలపురం/హుజూర్ నగర్, 15 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- విష జ్వరాలతో గోపాలపురం గ్రామ ప్రజలు గతి 20 రోజులుగా ప్రతి ఇంట్లో అందరూ విష జ్వరాలతో అనారోగ్య పాలైన గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వైద్య బృందం ఆశ వర్కర్లు గోపాలపురం పరిశీలన చేయడం జరిగింది. విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు.
విష జ్వరాల వల్ల ప్రతి ఇంట్లో హాస్పిటల్ ఖర్చు 30 నుంచి 50 వేలు దాకా ప్రతి ఇంటికి హాస్పిటల్ కి ఖర్చయినాయి. అయినా జరాలు తగ్గుముఖం పట్టలేదు. ప్రజలు విపరీతమైన నొప్పులతో, మఖాన దద్దుర్లతో నడిచే ఓపిక కూడా కోల్పోతున్నారు మా గోపాలపురం గ్రామం తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా విశ్వ జ్వరాలతో అతలాకుతలమవుతున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన వైద్య, నీటి, వాయు కాలుష్య అధికారులు విష జ్వరాలు కారణాలు పరిశీలించే విధంగా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ ని కోరుతున్నాం. కలెక్టర్ ఒకసారి మా గోపాలపురం పాటు చుట్టుపక్కల గ్రామాలను ప్రత్యేకంగా మీరు వచ్చి పరిశీలించాలని మా విన్నపం చీకూరి లీలావతి