ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
కమ్యూనిటీ సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కౌన్సిలర్ సహా అనుచరుల అరెస్ట్, రిమాండ్.
సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు రిమాండ్ వివరాలను సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్ వెల్లడించారు.
సోమవారం రాత్రి చివ్వెంల మండల పరిధి బిబిగూడెం గ్రామం (సూర్యాపేట మున్సిపాలిటి 3వ వార్డు) లో ప్రజా భద్రత కోసం ఏర్పాటుచేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు అని డయల్ 112 ద్వారా వచ్చిన సమాచారంపై చివ్వెంల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై విచారణ జరిపాం అని సూర్యాపేట రూరల్ సిఐ అన్నారు. ధ్వంసానికి పాల్పడిన వక్తులు స్థానిక కౌన్సిలర్ పడిదల సైదులు, అతని సహచరులుగా గుర్తించడం జరిగినది అన్నారు. ఈ సమయంలో కౌన్సిలర్, అతని వెంట ఉన్న వ్యక్తులు ఆటంకం కలిగించారు. దీనిపై చివ్వెంల పోలీసు స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేశామని అన్నారు. సంఘటనకు పాల్పడ్డ 3వ వార్డు కౌన్సిలర్ పడిదల సైదులు అతనిని సహచరులు పడిదల దుర్గాప్రసాద్, పడిదల కిరణ్, మత్స రాంబాబు, గోల్కొండ మురళి, పడిదల సతీష్ మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది అన్నారు.
ప్రజా భద్రతకోసం ఏర్పాటు చేసిన రక్షణ పరమైన వ్యవస్థను, సామాగ్రిని ధ్వంసం చేసినా, నష్టం కలిగించిన అలాంటి వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ప్రజా భద్రతలో అనుక్షణం విధులు నిర్వర్తిస్తూ రక్షణగా ఉంటున్న పోలీసు వారిపట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు విధులకు ఆటంకం కలిగించిన జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశం నందు చివ్వెంల ఎస్సై మహేష్, ఎస్ఐ 2 వెంకన్న, సిబ్బంది ఉన్నారు.