ప్రజావాణి ఫిర్యాదులపై చర్యలు:జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు
జోగులంబ గద్వాల 11 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 9 మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు కు ఫిర్యాదులు అందించారు.బాధితులు అందజేసిన ప్రతి ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. అలగే అక్కడే ఉన్న ఆలంపూర్, శాంతి నగర్ సర్కిల్ అధికారులకు ఆయ పరిదిలో నీ ఫిర్యాదుల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో మొత్తం 9 ఫిర్యాదులు
భూ వివాదాలకు సంబందించి - 06,,,కుటుంబ తగాదాలకు సంబందించి -01,,ప్రేమ వివాహం చేసుకున్నందుకు భద్రత కల్పించాలని -01,,ఇతర అంశాలకు సంబంధించి -01 పిర్యాదులు వచ్చాయి. అని పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.