ప్రజావాణి ద్వారా బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

జోగులాంబ గద్వాల ఐదు మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే ప్రజావాణి ద్వారా బాధితుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.
సోమవారం ప్రజావాణి పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 08 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని, బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ రోజు వచ్చిన పిర్యాదులలో
చీటింగ్ కు సంబంధించి -02 పిర్యాదులు.
భూ వివాదాలకు సంబంధించి -01 పిర్యాదు.
గడ్డివాము కు నిప్పు అంటుకోవడం పై అనుమానాలు ఉన్నాయని -01
ఇతర అంశాలకు సంబంధించి - 04
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా ఆఫీస్ నుంచి తెలియజేశారు.