ప్రజాకవి కాళోజీ స్ఫూర్తి చిరస్మరణీయం
— తెలంగాణ భాషా పరిరక్షణకు ఆయన సేవలు అమూల్యం
తెలుగు సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలు మరువలేనివి — ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు
కాళోజీ ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుకోవాలి — ఇటిక్యాల తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి .
జోగులాంబ గద్వాల 9 సెప్టెంబర్ 20026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఇటిక్యాల తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి సందర్భంగా బుధవారం ఇటిక్యాల తహసిల్దార్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కాళోజీ చిత్రపటానికి తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఎందరో కవులు, రచయితలకు కాళోజీ స్ఫూర్తిగా నిలిచారని, తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యం, ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహనీయుడని కొనియాడారు. ప్రజల భాషలో ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ, సమాజంలోని అన్యాయాలు, అసమానతలపై తన రచనల ద్వారా కాళోజీ గొంతెత్తారని తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌తో సత్కరించబడిన కాళోజీ ఆశయాలు, స్ఫూర్తి నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తహసిల్దార్ పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మనోహర్,రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్,జూనియర్ అసిస్టెంట్ అజాం సాయి,జి పి ఓ లు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు