ప్రజలకు అందుబాటులో ఎయిర్టెల్ సేవలు ఎమ్మెల్యే

May 29, 2026 - 22:22
 0  1
ప్రజలకు అందుబాటులో ఎయిర్టెల్ సేవలు ఎమ్మెల్యే

నాగారం 30 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

నాగారం మండల పరిధిలోని ఈటూర్ గ్రామ ప్రజలకు ఎయిర్టెల్ సర్వీస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. శుక్రవారం  నూతనంగా ఏర్పాటు చేసిన టవర్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ మునగడలో సెల్ ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి చిన్న సమాచారాన్ని చేరవేయడానికి సెల్ ఫోన్ పై ఆధారపడుతున్నామని గుర్తు చేశారు. సెల్ ఫోన్ పనిచేయడానికి సిగ్నల్ అవసరం ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ వంగూరి దామోదర్ ఉప సర్పంచ్ నంగునూరి మంజుల మండల నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం బయ్యం వెంకన్న నాతి వెంకన్న జిమ్మిలాల్ లక్ష్మయ్య గంట సోమిరెడ్డి యాదగిరి బాలరాజు బిక్షం లింగయ్య సైదులు వార్డు మెంబర్ లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి