ప్రచారంలో భాగంగా రెండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచర్ల కృష్ణారెడ్డి

Apr 20, 2024 - 20:28
 0  9
ప్రచారంలో భాగంగా రెండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచర్ల కృష్ణారెడ్డి
ప్రచారంలో భాగంగా రెండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచర్ల కృష్ణారెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి. ఆత్మకూర్ ఎస్.... పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని గెలిపిస్తే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేందుకు పార్లమెంటులో వత్తిడి తెస్తానని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండల పరిధిలోని నెమ్మీకల్ దండు మైసమ్మ ఆలయంలోఅన్నారు.బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జరిగిన ప్రచార కార్యక్రమo లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోని ప్రజలకు చుక్కలు చూపిస్తుందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు దద్దమ్మల్లా మారి ప్రైస్ మిల్లర్ల వద్ద కంకర మిల్లుల వద్ద భవనాలు నిర్మించిన వారి వద్ద బెదిరింపులకు గురిచేసి పశువుల్లా పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించకుండా అడిగిన వారిని  చెప్పుతో కొడతామంటూ బూతులు మాట్లాడుతూ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ మహిళలకు 2500 మృతి నిరుద్యోగులకు 4000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం మహిళా విద్యార్థులకు బ్యాటరీ స్కూటీ లను ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు గడిచిన ఏ ఒక్క పథకాన్ని అమలు చేయాలని ఈ పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఈ పథకాలు అమలు కాని వారు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాలు పొలం ఎండిపోయి సుమారు 600 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగిందని వాటిని పట్టించుకునే నాధుడే లేదని విమర్శించారు. కనీసం కెసిఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు  ప్రజలకు ఇదే అవకాశమని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దండు మైసమ్మ ఆలయం నుండి నెమికల్లు పశువుల సంత చౌరస్తా వరకు సుమారు పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు గంటన్నర రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ పి ఎస్ సి ఐ చైర్మన్ కొనతం సత్యనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తుడి నరసింహారావు మర్ల చంద్రారెడ్డి, నిమ్మల శ్రీనివాస్, ముద్దం కృష్ణారెడ్డి ఖానాల మల్లారెడ్డి బెల్లంకొండ యాదగిరి సత్యనారాయణ రెడ్డి బొల్లె జానయ్య, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు