ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన సూర్యపేట ఆర్డీవో

Apr 20, 2024 - 20:18
 0  3
ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన సూర్యపేట ఆర్డీవో

తెలంగాణ వార్త ఆత్మకూరుయస్ ప్రతినిధి. ఆత్మకూర్ ఎస్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని దాచారం, ఆత్మకూర్ ఎస్, నెమ్మికల్, ఏనుభాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల కు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. క్రయ విక్రయాల రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్రతిరోజు తేమ చూసి రికార్డుల్లో పొందుపరచాలన్నారు. కొనుగోలు వేగవంతం చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలు లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర శర్మ ,మండల తహసిల్దార్ వినోద్ కుమార్, మండల వ్యవసాయ అధికారులు దివ్య, విస్తరణాధికారులు శైలజ, శివకుమార్, సీనియర్ అసిస్టెంట్ ఇంద్ర కుమార్, సీఈఓ పట్నం లక్ష్మారెడ్డి, ఐకేపీ సీసీ చందు, గౌస్యా,రైతులు తదితరులు ఉన్నారు.