పోషణ మాసం వేడుకలు
తిరుమలగిరి 20 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
పోషణ మాసంలో భాగంగా ఈరోజు 9.వార్డు నందాపురం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం వేడుకలు జరిగాయి అందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని ఆకుకూరలు పప్పు దినుసులు పాలు సమతులమైన ఆహారాన్ని తీసుకోవాలని గర్భిణీలకు బాలింతలకు గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా 9. వార్డ్ కౌన్సిలర్ కే, మల్లయ్య ఐసిడిఎస్ సూపర్వైజర్ కే, మంగమ్మ డాక్టర్ ఎన్. సంజీవన్ సార్ హెల్త్ సూపర్వైజర్ కె. స్వరూపరాణి. ఏ ఎన్ ఎం సిహెచ్ సంధ్యారాణి అంగన్వాడి టీచర్ ఏ స్వప్న. తదితరులు పాల్గొన్నారు.