పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు నెలల నుంచి పగటి సమయంలో తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలు
ఈరోజు తేదీ 11-10-24 నాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు నెలల నుంచి పగటి సమయంలో తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కంసాలి బ్రహ్మయ్య తండ్రి పేరు నరసన్న అనే వ్యక్తి ఈరోజు వాహనాలను తనిఖీ చేస్తుండగా అతని బండిలో ఇనుప రాడు కలదు.అట్టి వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా పి ఎస్ కు తీసుకొచ్చి విచారణ చేయగా అతడు పెబ్బేరు పట్టణ పరిధిలో మూడు దొంగతనాలు మరియు కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మళ్ళపల్లి గ్రామంలో రెండు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది.అట్టి కేసులకు సంబంధించిన 260000/ వేల రూపాయలు మరియు రెండు కాళ్ల పట్టిలు రెండు కమ్మలు,ఒక చిన్న ఉంగరము అతని నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది, నేరసుడు నేరం ఒప్పుకున్నందున కంసాలి బ్రహ్మయ్య అనే రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపనైనది