పోలీసుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు.

Apr 13, 2025 - 22:53
Apr 13, 2025 - 23:12
 0  17
పోలీసుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు.

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం. 13/4/2025.

- జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది.
- పోలీసుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు.
- ప్రభలు నిషేదం, ప్రభల పేరిట అసభ్యకర నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు.
- జిల్లాలో DJ లు పూర్తిగా నిషేదం, DJ ఉపయోగిస్తే ఎన్విరాన్మెంట్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తాం.

..... కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

ప్రజల భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా సూర్యాపేట జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నది, పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదు కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి, అనుమతులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ గారు ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా DJ లను పూర్తిగా నిషేధించడం జరిగినది, పండుగలు, పెండ్లిల్లు, ఇతర సందర్భాలలో డీజేలు ఉపయోగించవద్దు, పోలీసు నిభందనలు పాటించకుండా DJ లు ఉపయోగిస్తే డీజే యజమానులపై, కార్యక్రమం నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది,  డీజే లు, వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. ఎన్విరాన్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రభలు నిషేధం, పండుగలు, సాంప్రదాయ ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రభల, డాన్స్ ప్రోగ్రామ్ లంటు అశ్లీల నృత్యాలు, అసభ్యకరమైన డాన్సులు ప్రదర్శిస్తే ఇలాంటి వాటికి పాల్పడే వారిపై నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే ల వినియోగం వల్ల, మద్యం మత్తులో డాన్సులు నిర్వహించడం వల్ల గ్రామాలు పల్లెల్లో అశాంతి వాతావరణం, అలజడి వాతావరణం ఏర్పడుతుందని తద్వారా వర్గాల మధ్య గొడవలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని ఎస్పీ గారు తెలిపారు. యువత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సంఘటనల్లో చాలా మంది యువత కేసుల్లో చిక్కుకుంటున్నారని భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయం విదేశాలకు వెళ్లే విషయంలో పోలీసుల నుండి అభ్యంతరాలు వస్తాయని తెలిపారు. మైకులను ఉపయోగించడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలని అనుమతి ఉన్నప్పుడే మైకులు వినియోగించాలని అది కూడా నిర్ణీతమైన శబ్దాన్ని పెట్టుకోవాలి నిర్దేశమైన సమయంలో కార్యక్రమం ముగించుకోవాలి అన్నారు. 

రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి - ఎస్పి.
ప్రతిరోజు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ చాలామంది మృత్యువాత పడుతున్నారు,  ప్రయాణ సమయంలో వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే ప్రమాదాలు నివారించవచ్చు అని ఎస్పీ గారు అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు వినూత్న చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో 255 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయని దీనిపై బ్లాక్ స్పాట్స్  గుర్తించామని, రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో ప్రమాద స్థలాల వద్ద నివారణ చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని జాతీయ రహదారులపై ర్యాష్, డ్రైవింగ్, ఓవర్ లోడ్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి వాహనదారులు పరిస్థితులకు అనుకూలంగా పరిమితులకు లోబడి వాహనాలు నడపాలన్నారు. తల్లిదండ్రులు, వాహన యాజమానులు జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు, మైనర్లకు, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి వాహనాలు ఇస్తే వీరి వల్ల ప్రమాదాలు జరుగుతాయి, ఇలా ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333