పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేలు
అడ్డగూడూరు 01ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అడ్డగూడూరు మండల కేంద్రంలోని మర్రిగడ్డలో ఉన్న 2వ చౌకదుకాణంలో తెల్లరేషన్ కార్డుగల కుటుంబలకు శాసనసభ్యులు మందుల సామేలు మంగళవారం సన్న బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు గల కుటుంబాలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శేషగిరిరావు, డి ఎస్ ఓ రోజా రాణి, మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,మార్కెట్ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్, టి పి సి సి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, పాశం సత్యనారాయణ, బాలెంల సైదులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొమ్మగాని అంజమ్మ లక్ష్మయ్య, డీలర్ల సంఘం అధ్యక్షులు గంగ, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల పవన్, పూలపల్లి రాజశేఖర్ రెడ్డి, బాలెంల సురేష్, మహేందర్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.