పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్న…