పెసా గ్రామ సభ లేకుండా అక్రమ నిర్మాణ నాణ్యత లేని కరకట్ట
పెసా గ్రామ సభ లేకుండా అక్రమ నిర్మాణ నాణ్యత లేని కరకట్ట
పెసా గ్రామ సభ పెట్టినమని ఆదివాసీలను నమ్మిస్తున్న కరకట్ట కాంట్రాక్టర్
పలువురు అధికారులు కాంట్రాక్టర్కు మద్దతు
రాజకీయ నాయకుల ఉచ్చులో జిల్లా కలెక్టర్ ఆర్డిఓ ఇరిగేషన్ మైనింగ్ అధికారులు
మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు గొప్ప వీరయ్య
మంగపేట, 23 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ములుగు జిల్లాలోని మంగపేట మండలం పరిధిలోని ఉండబడిన గోదావరి తీర ప్రాంతమైన మంగపేట కమలాపురం బోర్న్ నరసాపురం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజుపేట వరకు గోదావరి తీర ప్రాంతానికి ఆనుకొని గ్రామాలు ఉన్నవి మంగపేట మండలంలోని పూర్తిస్థాయిలో ఏజెన్సీ చట్టాలను పక్కనపెట్టి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉండబడిన అధికారులు వారి ఇష్టానుసారంగా రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి చట్టాలను తుంగలో తొక్కుతున్న అధికారులు మంగపేట మండలంలో కోట్ల రూపాయలు గోదావరి ఆనకట్ట కరకట్ట నిర్మాణం చేయడానికి సదర్ కాంట్రాక్టు పెసా గ్రామ సభ పెట్టకుంట తను ఇష్టానుసారముగా నాణ్యత లేకుండా కరకట్ట నిర్మాణం చేపడుతుంటే జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు రాజకీయ నాయకులచేతిలో కీలుబొమ్మలుగా ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగమైన చట్టం పెసా గ్రామ సభను పెట్టి తీర్మానం చేయకుండా పెసా గ్రామ సభ తీర్మానం పెట్టినమని సదర్ కాంట్రాక్టర్ ఆదివాసీలను మోసబుచ్చి నాణ్యత లేకుండా కట్టనిర్మానం చేపడుతున్నాడు. వెంటనే పెసా గ్రామ సభ తీర్మానం తీసుకొని గ్రామాభివృద్ధిని చేయాలని కట్టనిర్మానాన్ని పూర్తిస్థాయిలో నాణ్యత నాణ్యతతో కట్టాలని మన్య సీమ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య అన్నారు. ఆదివాసీల పేరు చెప్పి కొంతమంది అధికారులు కల్లబొల్లి మాటలు చెప్పి ఆదివాసీలను మోసం చేయాలని చూస్తే చట్టాలను కూడా మోసపుచ్చే విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య పత్రికముకంగా అన్నారు.