నూతన పాలకవర్గం హుజుర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
నూతన పాలకవర్గం హుజుర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు కృషి చేయాలని, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. హుజుర్ నగర్ మున్సిపల్ బడ్జెట్ 2026 - 27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్ పై మంగళవారం హుజుర్ నగర్ మున్సిపాలిటీ లో నిర్వహించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగించి సత్ఫాలితాలు రాబట్టలని కోరారు. మున్సిపాలిటీ 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.33 కోట్లతో బడ్జెట్ రూపొందించడం జరిగిందని వివరించారు. హుజుర్నగర్ మున్సిపాలిటీని దశల వారీగా అభివృద్ధి చేసుకునేందుకు పాలక వర్గం కృషి చేయాలన్నారు. వార్డులలో ఉన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోవాలని సూచించారు. ప్రాధాన్యత అంశాలైన త్రాగునీరు, పరిశ్యుధ్యం, రోడ్లకు సంబంధించిన పనుల కోసం ప్రత్యేక గ్రాంట్ల నిధులను వినియోగించుకుని పూర్తి చేయాలని తెలిపారు. రానున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆర్డిఓ కు సూచించారు వార్డులలోని ముఖ్యమైన ప్రదేశాలలో వీధిలైట్లు ఏర్పాటు చేస్తే మహిళ భద్రత కల్పించడం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమాన్ని మున్సిపాలిటీలలో సమర్థవంతంగా నిర్వహించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా మరియు అందంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసిల్దార్ కవిత, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.