పెద్దిరెడ్డి రంగారావు చిరస్మరణీయులు. 

కామ్రేడ్ పెద్దిరెడ్డి రంగారావు జీవితం భావితరాలకు ఆదర్శం 

Sep 29, 2024 - 20:26
 0  0
పెద్దిరెడ్డి రంగారావు చిరస్మరణీయులు. 

ఈరోజు తేదీ 29 09 2024 ఆదివారం స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్ లో కామ్రేడ్ పెద్దిరెడ్డి రంగారావు దశమ వర్ధంతి సంస్మరణ సభ జరిగింది. సభకు సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా శాసనమండలి మాజీ సభాపతి నేతి విద్యాసాగర్ రావు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ సిపిఐ కేంద్ర సభ్యులు కె వి ఎల్ ఆత్మీయ అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ,మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు వై వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులునెమ్మాది వెంకటేశ్వర్లు, మాజీ వైస్ జెడ్పీ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ,జిల్లా గ్రంథాలయ మాజీచైర్మన్ నిమ్మల శ్రీనివాస్ టి.ఆర్.ఎస్ నాయకులు గండూరి ప్రకాష్అనంతుల మల్లీశ్వరి, బూర వెంకటేశ్వర్లు చామల అశోక్ పాల్గొన్నారు ముఖ్య అతిథి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రంగారావు గారి జీవితం ఎందరికో ఆదర్శం అనుసరణీయమని చెప్పారు. సభాధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ సిపిఐ పార్టీలో సుదీర్ఘ నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రంగారావు గారు ఎందరో కార్మికుల జీవితాలలో వెలుగులు నింపారు అన్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రంగారావు గారు స్వార్థం లేని నాయకుడిగా పని చేయటం వారితో నాకు ఎన్నో సంవత్సరాల పరిచయం ఉండటం నా అదృష్టం అన్నారు. నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ రంగారావు కార్మికుడిగా పారిశ్రామికవేత్తగా రెండు పాత్రలను సమర్ధవంతంగా పోషించాడు అన్నారు. ఈ సభలో రైస్ మిల్లర్లు బోనాల రవీందర్ కక్కినేని చంద్రశేఖర్ గజ్జల జనార్ధన్ ఉప్పల సూర్యనారాయణ ,ట్రేడ్ యూనియన్ నాయకులు సత్తిరెడ్డి ,శాంతయ్య ,సైదులు బూర వెంకటేశ్వర్లు దోరపల్లి శంకర్ , కౌన్సిలర్లు సుంకర రమేష్, జ్యోతి కర్ణాకర్ సూర్యాపేట చెందిన పలు ట్రేడ్ యూనియన్ సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని తన తండ్రి గారి దశామ సంస్మరణ గా రంగారావుగారు కుమారులు పెద్దిరెడ్డి గణేష్ ,పెద్దిరెడ్డి రాజా, చంద్రశేఖర్ ,వెంకటకృష్ణ అల్లుళ్ళు తలారి ప్రసాద్ బోలి శెట్టి మధు, ఇంకా వారి కుటుంబ సభ్యులు అభిమానులు నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333