పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ ధరలు తగ్గించాలి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు , కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి - వై విక్రమ్
ఖమ్మం : ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ ( ఏఐఆర్ టి డబ్ల్యూ ఎఫ్ - సీఐటీయూ ) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద ప్లే కార్డ్ తో నిరసన కార్యక్రమం జరిగింది . ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై విక్రమ్ , జిల్లా ఉపేందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో మూడి చమురులు ధరలు తగ్గుతున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంధన ధరలను పెంచి వాహనరంగంపై సామాన్య ప్రజలపై అదనపు భారం మోపిందని విమర్శించారు . కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు బిజెపి ప్రభుత్వం ఇలా ప్రజల జేబులు ఖాళి చేస్తుందని విమర్శించారు . కేంద్ర ప్రభుత్వము మొన్నటికి మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ పై 3 రూపాయలు డీజిల్ పై 3 రూపాలు పెంచింది , అట్లాగే రెండు రోజుల క్రితం 90 పైసలు డీజిల్ , పెట్రోల్ పెంచింది గ్యాస్ ధరను రూపాయి చేసింది , ఈరోజు పెట్రోల్ పై 80 పైసలు , డీజిల్ పై 80 పైసలు మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలోనే పెంచింది అని ఆరోపించారు . ఇలా 4 రూపాయలు పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచడం మూలంగా ఈరోజు రవాణా రంగం ఆటో , ట్రాలీ , క్యాబ్ , డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు . కార్మికులు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులు ఆదాని అంబానీ కొరకు 4 లేబర్ కోడ్స్ ను అమలు చేసిందని , కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు . వెంటనే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు వల్ల వందమంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు . కారు ట్రావెల్స్ , ఆటో, ట్రాక్టర్ , లారీ వాహనాలకు గిరాకి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఈ తరుణంలో ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చందనంగా ధరలు పెంచడం తయారైందని ఈ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు . పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని , ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాల ను డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కోశాధికారి ధరావత్ రాందాస్ , జిల్లా కమిటీ సభ్యులు గంగుల నరసయ్య , బీమా , ఉపేందర్ , రవి , గాని , నాగేశ్వరరావు , శ్రీనివాసరావు , రాజారావు , నవీన్ మరియు ట్రాన్స్పోర్ట్ పాల్గొన్నారు .