పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన

Apr 26, 2026 - 20:56
Apr 26, 2026 - 20:56
 0  1
పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ వద్దిరాజు స్పందన

- ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్

- సత్వరమే సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి

- రేపటికల్లో సమస్య అధిగమిస్తామని హామి

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రంగా వేదిస్తున్న పెట్రోల్ డీజిల్ కొరతలపై బీఆర్ఎస్ ఎంపీ, పెట్రోల్, సహజ వాయు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. ఆయా కంపెనీల సరఫరాదారులు, ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి పెట్రోల్ డీజిల్ కొరతలను తక్షణమే తీర్చాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పలువురు పెట్రోల్ బంక్ ల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పెట్రోల్, డీజిల్ సరఫరాలో జరుగుతున్న జాప్యం, బంకుల్లో ఏర్పడుతున్న కొరత గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన అక్కడి నుంచే ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్నటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో రైతులు, చిరుద్యోగులు, వ్యాపారస్తులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆయా కంపెనీల ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. బంకుల యజమానులు డీడీలు చెల్లించినా కూడా ఆయిల్ సరఫరా చేయకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారని..? ఆయన వారిని ప్రశ్నించారు. రేట్ల హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఆయిల్ కొరత ఇలాగే కొనసాగితే తెలంగాణలో సమస్యలు తీవ్రమవుతాయని ఆయన సరఫరా కంపెనీలకు వివరించారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ కొరతను నివారించాలని, సరఫరా వేగవంతం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులు.. సోమవారానికల్లా సమస్య ను అధిగామిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఎంపీ రవిచంద్ర కు బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333