కేంద్రమంత్రి పదవిపై అరుణ హాట్ కామెంట్స్
మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సంచలన విజయం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనపై డీకే అరుణ స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాసీఎం రేవంత్‌రెడ్డికు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌నుముఖ్యమంత్రి రేవంత్ గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి పదవి కోసం తాను ప్రయత్నాలు చేయనని.. పార్టీ నిర్ణయం తీసుకుంటోందని తెలిపారు.
ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచే డిమాండ్ వస్తోందని చెప్పారు. నల్లగొండ, భువనగిరిని గెలిపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి రేవంత్ కు ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. ప్రధానిగా ఉండకూడదని చెప్పడానికి రేవంత్ ఎవరు? అని ప్రశ్నించారు. 14స్థానాలు గెలుస్తామని.. కాంగ్రెస్ 8స్థానాలే గెలవటంపై రేవంత్ ఏమంటారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు గుర్తించటం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోకుంటే ఇబ్బంది పడతారని డీకే అరుణ పేర్కొన్నారు..