పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

May 1, 2025 - 18:52
May 1, 2025 - 20:29
 0  7
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

నేర సమీక్ష సమావేశంలో-------- జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు ఐపీఎస్  .

జోగులాంబ గద్వాల 1 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల.  జిల్లా లో ప్రాపర్టీ నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని,  రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హల్ నందు పోలీస్ 
అధికారులతో జిల్లా ఎస్పి  నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ  పోలీస్ స్టేషన్ ల వారిగా గత నెలలో నమోదు అయిన కేసులు,  UI లో ఉన్న కేసులను పరిశీలించారు. అందుకు సంబంధించి కేసు దర్యాఫ్తు లో పారదర్శకంగా విచారణ చేపట్టాల్సిన అంశాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై  అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ... రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జిల్లా లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల వివరాలు పరిశీలించారు. ఇట్ అండ్ రన్ కేసులలో మిగిలిన కేసులలో ట్రెస్ ఔట్ కానీ వాహనాలను గుర్తించి కేసులను చేదించాలని సూచించారు, ప్రమాదాల నియంత్రణకు అవసరమైన చోట బారికేడ్స్ ఏర్పాటు చెయ్యాలని అన్నారు. రోజు విస్తృతంగ వాహన తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేపట్టాలని అన్నారు. షి టీం, కళా బృందం ద్వారా ట్రాఫిక్ నియమాల పై అవగాహణ కల్పించాలని, పోలీస్ స్టేషన్ ల పరిధిలో వాహనాల డ్రైవరు లకు కూడా అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
 CCTNS 2.0 వర్షన్ పై ప్రతి ఒక్కరు అవగాహాన పెంచుకోవాలని అన్నారు,  కేసులకు సంబంధించిన ప్రతీ ఫైల్ CCTNS లో అప్లోడ్ చెయ్యాలని అన్నారు.
ప్రాపర్టీ నేరాల నియంత్రణకు పకడ్బందీ గా చర్యలు చేపట్టాలని , సరి హద్దు రాష్ట్రాలలో ప్రాపర్టీ నేరాల గ్యాంగ్ లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ దిశ గా కేసుల చేదన పై దృష్టి పెట్టాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిదిలో  బీట్ గస్తీ ల సంఖ్య పెంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ నేరాలు జరుగకుండ పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రాపర్టీ సంబంధిత కేసులలో ప్రత్యేక కార్యాచరణ తో కేసులను ఛేదించాలని అన్నారు.
 ప్రతి పోలీస్ స్టేషన్ లో CC కెమెరాలు ఉండాలనీ , పని చెయ్యని వాటిని పునరుద్ధరించాలని సూచించారు. నమోదు అయిన కేసులలో నిందితుల అరెస్ట్ పెండింగ్ లేకుండా చూడాలనీ ,UI కేసులలో పారదర్శకంగా విచారణ చేపట్టి కోర్టు లో చార్జి షీట్ వెయ్యాలని సూచించారు.  పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడితో గౌరవం తో మెలిగేలా రిసెప్షన్ సిబ్బంది కి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని, కోర్టు అధికారులతో రోజు మాట్లాడుతూ కోర్టు లో సంబంధిత కేసుల వివరాలు అప్డేట్ అవుతూ ఉండాలనీ సూచించారు.  


ఈ సమవేశం లో డి .ఎస్పీ మోగిలయ్య  , ఆలంపూర్, గద్వాల్, శాంతి నగర్ సీఐ లు రవి బాబు, శ్రీనివాస్ , టాటా బాబు, ఆర్ ఐ వెంకటేష్, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డీ ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333