పుకార్లను నమోద్దు

Sep 9, 2025 - 19:24
 0  9
పుకార్లను నమోద్దు

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

గద్వాల‌ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ గద్వాల మండలం లత్తిపురంలో గ్రామ శివారులో ఒక దయ్యం ఓ వ్యక్తికి కనబడిందని, ఆ వ్యక్తి దాని ఫోటో తీయగానే దయ్యానికి కోపం వచ్చి అతని మీద దాడి చేసిందని ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లత్తిపురం గ్రామంలో దయ్యం సంచరిస్తుందని, సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలను ఆకతాయిలు వైరల్ చేస్తున్నారని, అవి పూర్తిగా అబద్ధం ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రజలు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని గద్వాల్ రూరల్ పోలీసులు సూచించారు. ఆకతాయిలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు‌.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333