డిసిసిబి ఉద్యోగుల ఆందోళన

Apr 17, 2026 - 10:35
Apr 17, 2026 - 16:24
 0  2
డిసిసిబి ఉద్యోగుల ఆందోళన

డిసిసిబి ఉద్యోగుల ఆందోళన

 తెలంగాణ  వార్త వాజేడు: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఖమ్మం, వాజేడు బ్రాంచ్ (పేరూరు) నందు సహకార బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాట చేపట్టారు గతంలో పాలకవర్గాలు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్ ఎక్స్ గ్రేషియా తిరిగి చెల్లించాలని హెచ్.ఎల్.సి కమిటీ నిర్ణయించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హైదరాబాద్ వారి పిలుపుని అనుసరించి TCCBEA చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పాశం నాగేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనబాట చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ HLC కమిటీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే దశలవారీ ఆందోళన ఉధృతం చేసి ది 02.05.2026న రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల సమ్మె కూడా చేపడతామని తెలియజేశారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్