పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకాని తీరని లోటు

Mar 25, 2025 - 19:25
 0  6
పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకాని తీరని లోటు

హుజూర్నగర్ లో కోవ్వత్తులతో సంతాపం

             రెవ. గడ్డం డేవిడ్ రాజు
సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు

          రెవ. మేసా దేవసహాయం
హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు

మంగళవారం 25 మార్చి : హుజూర్నగర్ పట్టణ కేంద్రం నందు టౌన్ హల్ వద్ద ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకులు అకాల మరణం పట్ల కొవ్వాతులతో ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ న్నామని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రెవ. గడ్డం డేవిడ్ రాజు, హుజూర్నగర్ పాస్టర్స్ పెలోషిఫ్ చైర్మన్ రెవ. తలకప్పల సుధాకర్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవజనుడు ప్రవీణ్ పగడాల మరణ వార్త వినగానే హృదయంలో చాలా బాధ కలిగింది ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం మరియు దైవ సేవకుల పక్షమున నిలబడి పోరాడిన గొప్ప యోధుడు దేవుడు తనకు ఇచ్చిన వాక్చాతుర్యంతో అనేక టీవీ ఛానల్లో మరియు యూట్యూబ్ ఛానల్ లో క్రైస్తవుల పక్షాన డిబేట్ లో పోరాడిన గొప్ప యోధుడు అనీ వారు మరణించడం తెలుగు రెండు రాష్ట్రాల క్రైస్తవ ప్రజలకు , దైవ సేవకులకు తీరనిలోటు అనీ అన్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  బిషప్ దుర్గం ప్రభాకర్, హుజూర్నగర్ అధ్యక్షులు రెవ. మేసా దేవసహాయం మాట్లాడుతూ ఈ యాక్సిడెంట్ మరణం పట్ల పలు అనుమానాలు, అతనిని హత్య చేశారానే భావన కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో గౌరవ సలహా దారులు రెవ. మేడి పాల్,హుజూర్నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. పెద్దపంగు ఆమోస్, హుజూర్నగర్ నియోజకవర్గ సెక్రటరీ పాస్టర్ పాతకోటి దేవదానం, పాస్టర్ పాతకోటి జాషువా తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333