పాలిటెక్నిక్ కళాశాలకు బస్సులు లేక విద్యార్థుల ఆవేధన.

Jul 6, 2026 - 20:31
 0  5
పాలిటెక్నిక్ కళాశాలకు బస్సులు లేక విద్యార్థుల ఆవేధన.

జోగులాంబ గద్వాల 6 జులై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం గోనుపాడు వద్ద గల పాలిటెక్నిక్ కళాశాలకు ​సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు కళాశాలకు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గద్వాల అర్టీసి బస్టాండ్ నుంచి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గద్వాల ఆర్టీసి బస్టాండ్ నుంచి పాలిటెక్నిక్ కళాశాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాయంత్రం వేళల్లో కళాశాల వద్ద బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది అని ఆవేధన వ్యక్తం చేశారు. గద్వాల నుంచి అదనపు  బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333