పాపికొండలు విహారయాత్ర తాత్కాలిక రద్దు
రాజమండ్రి 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త చెప్పారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పాపికొండలు విహారయాత్రను జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా, నదీ ప్రవాహంలో ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు పర్యాటకులు సహకరించాలని కోరారు. తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.