పల్స్ పోలియో ప్రారంభించిన. గ్రామ సర్పంచ్.
జోగులాంబ గద్వాల 28 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం పరిధిలోని చాగాపురం గ్రామపంచాయతీ ఆవరణ నందు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో చాగాపురం గ్రామ సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ మాట్లాడుతూ, 0, నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు బలమైన రక్షణ కవచాన్ని అందిద్దామనీ ఆమె అన్నారు. తల్లిదండ్రులు, నిర్లక్ష్యం చేయకుండ ఈ రోజు మీ సమీపంలోని పోలియో కేంద్రానికి వెళ్లి మీ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని గ్రామ ప్రజలకి ఆమె విజ్ఞప్తి చేశారు.
పల్స్ పోలియో చుక్కలువేయించకూడని చిన్న పిల్లలు. తీవ్రమైన జ్వరం, వాంతులు విరోచనాలు, దగ్గు జలుబు ఊపిరి ఆడక పోవడం, మీచు వ్యాధిగ్రస్తులు, ఏ వ్యాధితోనైనా సరే చికిత్స పొందుతున్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించరాదని ఆమె చిన్నారుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు , ఆశా కార్యకర్తలు, ఉప సర్పంచ్ పరుశురాముడు, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు పరుశురాముడు తదితరులు పాల్గొన్నారు.