యాదవులు శాసించే స్థాయికి ఎదగాలి: రఘునాథ్ యాదవ్
యాదవులు శాసించే స్థాయికి ఎదగాలి: రఘునాథ్ యాదవ్
యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని సమాజంలో శాసించే స్థాయికి ఎదగాలని తెలంగాణ యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా శ్రీ లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో యాదవ మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యాదవ కార్పొరేషన్ చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, తండు శ్రీనివాస్ యాదవ్, అంబర్‌పేట శ్రీనివాస్ యాదవ్, మేకల వీరన్న యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ యాదవులు రాజకీయ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకుని ముందుకు సాగాలని, ఐక్యతతో పనిచేస్తే సమాజంలో మరింత ఉన్నత స్థానాన్ని సాధించగలరని పేర్కొన్నారు. యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని ప్రజాప్రతినిధులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెల్లి చంద్రశేఖర్ యాదవ్, లింగయ్య యాదవ్, మల్లేష్ యాదవ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, యాదవ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.