పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ సంధ్య కిరణ్మయి.
జోగులాంబ గద్వాల 27 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో ఈనెల 28 నుంచి జరిగే పల్స్ పోలే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి. డాక్టర్ సంధ్య కిరణ్మయి అన్నారు. శనివారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని బూతులు వైజ్ గా కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 0 నుండి 5 సంవత్సరాల లోపు 69,383 మంది చిన్నారులు ఉన్నట్లు వీరందరికీ నూరు శాతం పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. హై రిస్క్ లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వలస కూలీలు. ఇటుక బట్టీలు కోళ్ల ఫారాలు నిర్మాణ రంగా కార్మికులు పిల్లలు ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రత్యేక బృందాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొదటిరోజు బూతు స్థాయిలో పోలియో చుక్కలు వేయడానికి జిల్లావ్యాప్తంగా మొత్తము ఒక వెయ్యి 884 సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని. సోమవారం మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి 12 గంటల్లో కు పోలియో చుక్కలు ప్రారంభ కార్యక్రమం కొనసాగుతున్నట్లు రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లలో ట్రాన్స్ఫర్ టీమ్ లో చుక్కలు వేయిస్తారని తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా 45 మందిని సెక్టార్ సూపర్వైజర్ గా నియమించడం జరిగిందని అన్నారు. నోడల్ అధికారిగా డాక్టర్ మహ్మద్ ఆర్గాన్ అలీ రామచంద్రరావు ఎన్ సి డి ప్రోగ్రాం డాక్టర్ జి రాజు టిబి అండ్ లెప్రసీ ప్రోగ్రాం డాక్టర్ ప్రసన్న రాణి ఎం హెచ్ ఎన్ ప్రోగ్రామ్ అధికారి పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి. మాట్లాడుతూ. పోలియో నిర్మూలన మనందరి బాధ్యత. ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ పోలి చుక్కలు వేయించాలని ప్రతినిధులు. మండల జిల్లా స్థాయి అధికారులు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. పోలియో మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు కానీ ఎలాంటి ప్రతికూల సంఘటనలు కానీ జరగవు. అనాలోచిత ప్రభావాలను నమ్మకుండా అప్పుడే పుట్టిన పసికందు నుంచి ఐదు సంవత్సరాలు లోపు చిన్నారులందరికీ నిర్భయంగా తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించి పిల్లల అంగవైకల్యానికి గురికాకుండా నిండు నూరేళ్లు జీవితానికి రెండు చుక్కలు పోలియో మందు వేయించి వారి జీవితానికి బంగారు బాటలు వేయాలని వారు కోరారు. పుట్టినరోజు కానీ నిరంతర వ్యాధి నిరోధక తికాల కార్యక్రమాలను గాని మరియు ఇంతగా మునుపుల ఎప్పుడైనా ఎక్కడైనా వేసిన వేయించిన పిల్లలందరి కూడా మరోసారి ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహం లేకుండా నిర్భయంగా పోలియో చుక్కలు వేయించాలని వారు కోరారు. పోలే చుక్కలు ఎలాంటి పిల్లలకు మరియు ఎవరికి వేయకూడదు అనేది తెలియజేశారు. తీవ్రమైన జ్వరము వాంతులు విరేచనాలు దగ్గు జలుబు ఊపిరి ఆడకపోవడం. ముచ్చు వ్యాధిగ్రస్తులు ఏ వ్యాధితోనైనా చికిత్స పొందుతున్న పిల్లలకు చుక్కలు వేయించరాదు. ఇట్టి బృహత్తరమైన కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల జిల్లా అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మీ డియో మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రతినిధులు ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.