పల్లె పంచాయితి లో అప్ స్టాక్ కలకలం. 

Oct 16, 2024 - 20:36
 0  5
పల్లె పంచాయితి లో అప్ స్టాక్ కలకలం. 

జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లకుండా కవర్ చేసిన ఎంపీడీవో ఖాజావలి.

 ఉద్దేశపూర్వకంగానే కాలయాపన.
 
ముడుపులు ఏమైనా ముట్టాయా అనే అనుమానంతో.. బాధితుని గుండెల్లో గుబులు.

జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- రాజోలి జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ నియోజకవర్గం, రాజోలి మండల పరిధిలోని నసనూర్ గ్రామానికి చెందిన ఎండి. రషీద్ అనే వ్యక్తి యొక్క తన ఐదు ఫీట్ల స్థలానికి సంబంధించి అర్జీలు ఇస్తే, ఇచ్చిన అర్జీలను పక్కనపెట్టి కాలయాపన చేసిన మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఖాజావళి. పలుమార్లు తన కార్యాలయం చుట్టూ తిప్పుకొని చివరికి అన్యాయం చేశాడు, తన పై అధికారి ఎంపిడిఒ బదిలీపై వెళ్లిన తర్వాత ఎంపీవో గాను ఎంపీడీవో గా ఆయనే బాస్ గా చలామణి అవుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేయండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించి, నా 5 ఫీట్ల స్థలాన్ని కబ్జా చేసిన ఆక్రమణదారుడు ఫీల్డ్ అసిస్టెంట్ జానకి రాముడు అనే వ్యక్తి సహకరించి, జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లకుండా కవర్ చేశాడు, నేను ఇచ్చిన అర్జీలకు ఎలాంటి స్పందన లేకపోవడంతో, మండల కార్యాలయానికి వెళ్లి అడగగా అందుకు బదులుగా నాకేమీ తెలియదు బదిలీ పై వెళ్లిన అధికారిని పోయి అడుగు అని ఇస్తాను సారం వచ్చినట్లు నా పై హసహించుకోవడం జరిగింది. న్యాయం చేయాల్సిన అధికారి ఇలా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనితో నేను తీవ్ర ఆవేదనకు గురవుతూ.. ఇట్టి విషయాన్ని జిల్లా DPO దృష్టికి తీసుకు వెళ్లినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు, ఇంతవరకు *మండల స్థాయి అధికారుల కార్యాలయాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోవడం చాలా దురదృష్టకరం, మరి నేను ఇచ్చిన అర్జీలు ఏమైనట్టు ఎక్కడికి వెళ్లినట్టు ఒక DPO కార్యాలయంలో ఇచ్చిన అర్జీలకే భద్రత లేనప్పుడు మండల అధికారుల పనితీరు ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల పంచాయితిలలో అప్ స్టాక్ ల సమస్యలతో సతమతమవుతూ మండల స్థాయి అధికారుల కాలయాపనతో నలిగిపోతున్నారు. కనీసం జిల్లా గౌరవ కలెక్టర్  తమ దృష్టికి తీసుకొని సబ్ రిజిస్ట్రార్, DPO, MPDO, బదిలి పై వెళ్లిన పంచాయితీ కార్యదర్శి అధికారి దస్తగిరి లపై క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ చేయించి నాకు న్యాయం  ( 30 లక్షల తో నిర్మించుకున్న గృహ నిర్మాణాన్ని గృహప్రవేశం చేసుకోకుండా ఆపడం జరిగింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333