పల్లె దవఖానను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

అడ్డగూడూరు 04 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామంలో పల్లె దవాఖానను ఆకస్మిక తనికీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు పల్లె దవఖానలోని రికార్డ్స్ సీట్లను పరిశీలించిన అనంతరం చుట్టుపక్కల గ్రామాల రోగులకు నెలనెలా సరిపడే మందులు అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఆశా వర్కర్ ను అడిగి తెలుసుకున్నారు.పల్లె దవఖానలో ఉన్న ఏఎన్ఎం లలిత డాక్టర్"బి.భార్గవి ఆదేశాల మేరకు చిర్రగూడూరు గ్రామంలో రోగులకు వ్యాక్సిన్, మందులు ఇచ్చే పనిలో ఉందని డాక్టర్"బి భార్గవి అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రేమలతో, ఎమ్మార్వో కార్యాలయం అధికారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.