పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు:  జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

Mar 19, 2025 - 18:43
Mar 19, 2025 - 18:44
 0  2
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు:  జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  జిల్లా పరిధిలో  జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్  ప్రకటనలో తెలిపారు. జిల్లా లో 40 పరీక్షా కేంద్రాలలో 7,717 మంది విద్యార్ధులు వ్రాసే పదవ తరగతి  పరీక్షల సందర్భంగా   పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ  తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు  పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333