పదవీ విరమణ పొందిన ఇద్దరు ఏఎస్సైలను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్సైలు శ్యామ్ సుందర్ రావు మరియు శ్రీనివాసరావు గార్లను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.చుంచుపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామ్ సుందర్ రావు గారు మరియు భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు గారు ఈ రోజుతో పోలీసు శాఖలో తమ సర్వీస్ ను ముగించుకొని పదవీ విరమణ పొందడం జరిగింది.గత 40 సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ ఇద్దరు అధికారులను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు.భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు.పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు పోలీసు శాఖలో తమ అనుభవాలను ఎస్పీ గారితో పంచుకున్నారు.అనంతరం జిల్లా పోలీసు శాఖలో వారు అందించిన సేవలకు గాను ఎస్పీ గారు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడు ఏసోబు మరియు తదితరులు పాల్గొన్నారు.