పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు

Apr 30, 2026 - 18:28
 0  0
పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు

పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి ఈ రోజు పదవీ విరమణ పొందిన ఐదుగురు ఏఎస్ఐలు,ఒక హెడ్ కానిస్టేబుల్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించడం జరిగింది.జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు వీరిని ఘనంగా సత్కరించారు.కొమరారం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బి.తాతారావు,DAR నందు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న టి.వెంకట్రావు,అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నందు ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న టి.వెంకట సుబ్బారావు,ఇల్లందు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ అబ్దుల్ ఘని,DAR నందు ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కొరసా నాగేశ్వరరావు,DAR నందు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు బి.శ్రీరామ్ గార్లు ఈ రోజు పదవీ విరమణ పొందడం జరిగింది.పదవీ విరమణ పొందిన ఈ ఆరుగురు అధికారులను డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామితో పాటు ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,కార్యాలయ ఏవో మంజ్యా నాయక్,ఎంటిఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు ఇతర అధికారులు,పోలీసు అధికారుల సంఘం సభ్యులు శాలువాలతో,పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.అనంతరం పోలీస్ శాఖలో వీరి అనుభవాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ మల్లయ్య స్వామి మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని  కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.సుమారు 40 ఏళ్ల పైన పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన ఆరుగురు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333