పచ్చని చెట్లతో పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం
వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్
తిరుమలగిరి 23 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ “ఒక్కరు–ఒక మొక్క” అనే స్ఫూర్తితో ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, మన గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు. మొక్కలు మనకు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఎంతో ముఖ్యమైనవి. ప్రతి ఇంటి ముందు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చని వెలిశాల–పరిశుభ్రమైన వెలిశాలగా తీర్చిదిద్దుకుందాం. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు మెంబర్ పులిమామిడి అశోక్, గ్రామపంచాయతీ సెక్రటరీ అరుణ్, ఫీల్డ్ ఆఫీసర్ షాంపూ నాయక్, మహిళా సంఘం నాయకులు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.