విద్యార్థి సంఘాల నాయకులపై ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టిన  అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Jun 27, 2026 - 16:12
 0  0
విద్యార్థి సంఘాల నాయకులపై ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టిన  అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి

 ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టకపోతే భారీ ఉద్యమం చేపడతాం 
 పోలీసులు ప్రైవేటు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించడం తగదు...
 డిఇఓ అశోక్ ను ని వెంటనే సస్పెండ్ చేయాలి.
 త్రివేణి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి. 
 విద్యార్థి సంఘాల పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. 
 విలేకరుల సమావేశంలో వామపక్ష నాయకుల డిమాండ్ 

 సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని త్రివేణి స్కూల్ యాజమాన్యం అక్రమ పద్ధతులలో విద్యార్థులకు అధిక రేట్లతో నోట్ బుక్స్, టై,బెల్టు విక్రయించడానికి వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన విద్యార్థి నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో వామపక్ష పార్టీల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై తప్పుడు ఆరోపణలు చేసి పోలీసు కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలుచేస్తూతల్లిదండ్రులను తీవ్రంగాఇబ్బందులకుగురిచేస్తున్నాయని, ఫీజుల దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని కోరారు. ముఖ్యంగా త్రివేణి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు నోట్‌బుక్స్, టై, బెల్టులు బలవంతంగా విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ,ఆయాజమాన్యంపై వెంటనే కేసు నమోదు చేసి పాఠశాల అనుమతిని (పర్మిషన్) రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) అశోక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖ అధికారులు తమ బాధ్యతలను విస్మరించి ప్రైవేట్ యాజమాన్యాలకు అండగా నిలవడం వల్లే జిల్లాలో ఫీజుల దోపిడీ నిర్బంధం లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. మరోపక్క విద్యార్థి నాయకుల పై తప్పుడు ఆరోపణలకు ప్రైవేటు కళాశాల యాజమాన్యం పాల్పడుతుందని తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు.విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలను అరికట్టాలని, విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
లేకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను సహించబోమని, కలిసొచ్చే సంఘాలను, ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, ఎం సిపిఐ (యూ) జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి, రైతాంగ సమితి రాష్ట్ర నాయకులు నల్లెడ మాధవరెడ్డి, మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, నాయకులు అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333