నేలకొండపల్లి లో వాసవి క్లబ్ నూతన కార్యవర్గం
తెలంగాణ వార్త ప్రతినిధి :- ఖమ్మం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో వాసవి క్లబ్ భక్త రామదాసు కపుల్స్ నేలకొండపల్లి క్లబ్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గజ్జల రామకృష్ణ చేతుల మీదగా ఇనాగ్రేషన్ మరియు జిల్లా గవర్నర్ చారు గుళ్ళ శ్రీనివాస్ చేతుల మీదగా ఇన్స్టాలేషన్ జరిగినది క్లబ్ అధ్యక్షురాలు దోసపాటి కల్పన, ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి స్రవంతి, కోశాధికారి దోసపాటి కళ్యాణి లను ప్రమాణస్వీకారం మహోత్సవం జరిపించారు క్లబ్ అధ్యక్షురాలు దాసపాటి కల్పన మాట్లాడుతూ అతి త్వరలో నేలకొండపల్లి వాసవి క్లబ్ సహకారంతో ఒక నూతన బస్టాండును ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేట్ వైస్ ప్రెసిడెంట్ రేగూరి హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రేగురి వాసవి, రీజియన్ చైర్మన్ గోళ్ళ నరసింహారావు, జోన్ చైర్మన్ డాక్టర్ నాగు బండి శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు దోసపాటి చంద్రశేఖర్, కొత్త కరుణ, తల్లాకుల అశోక్, తెల్లాకుల జయశ్రీ, ప్రవీణు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు