నేలకొండపల్లి లో పంజా విసరనున్న... హైడ్రా

Aug 28, 2024 - 12:06
 0  688
నేలకొండపల్లి లో పంజా విసరనున్న... హైడ్రా
నేలకొండపల్లి లో పంజా విసరనున్న... హైడ్రా

కబ్జాల రాయుళ్ల వెన్నులో వణుకు....?

గ్రీన్ బెల్టులు.. బఫర్ జోన్లు.. ఎన్ఎస్పి కాల్వలుసైతం "మటుమాయం"...?

*నేలకొండపల్లిలో చర్చి ఎదురుగా మూడు చేతులు మారిన గ్రీన్ బెల్ట్ స్థలం..?

*2022లో సాక్షాత్తు కలెక్టర్ గౌతమ్ కు ఫిర్యాదు...?
*స్థలాన్ని పరిశీలించి... వాస్తవమేనని నిర్ధారించిన డిపిఓ పుల్లారావు...?
*అయినా.. కొనసాగిన కోటి రూపాయల అక్రమ పర్వం...?
*గూడవల్లి రామబ్రహ్మం (బివిఆర్ కాంప్లెక్స్) వ్యవహారం చిత్రం .. .విచిత్రం...?
*2019లో నేలకొండపల్లి గ్రామపంచాయతీలో ఫిర్యాదు లు చేసిన పాలక వర్గం సభ్యులు...?

*అలా ఫిర్యాదు చేశారో లేదో...? ఇలా తొమ్మిది కోట్లకు"కైవసం"...?
*షాపింగ్ కాంప్లెక్స్ కు పార్కింగ్ స్థలానికి బదులు షాపుల నిర్మాణం...?
*నాలుగు దిక్కుల కబ్జా కోరల్లో ప్రభుత్వ దవాఖాన...?
*కోటి రూపాయల స్థలంపై కన్ను...? లేని రహదారి సృష్టించిన ఓ వెంచర్ ర్వాహకులు...?
*ఓ వెంచర్ నిర్వాహకులు గ్రామపంచాయతీ పాలకవర్గం ఫిర్యాదు...? గ్రీన్ బెల్ట్ కు తక్కువ స్థలం కేటాయింపు...?
*అందరిదీ అదే దారి.. అన్నీ తెలిసి కన్నెత్తి చూడని యంత్రాంగం...?
*ఓ తాజా మాజీ ప్రజా ప్రతినిధి భాగస్వామ్య వ్యాపారం...?
ఐదు కోట్ల నుండి 6 కోట్ల మేర వెంచర్ గ్రీన్ బెల్టులు వదల లేదా...?
*తెలంగాణ వార్త రియల్ ఎస్టేట్ కబ్జాలపై.. ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై"ప్రత్యేక కథనం...1


పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రం తో పాటు వెలిసిన రియల్ ఎస్టేట్ సంస్థ లు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా గ్రీన్ బెల్ట్ ల ఎగవేత సేకరించినస్థలాలను దర్జాగా వ్యాపారం చేసుకుంటూ రిజిస్ట్రేషన్లపర్వం కొనసాగటం మరియు డ్రైనేజీ వ్యవస్థ కు ఉపయోగించే కాలువను సైతం కబ్జా చేసి దర్జాగా కాంప్లెక్స్ నిర్మాణం పార్కింగ్ స్థలానికి వదలాల్సిన స్థలం లేకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే నేలకొండపల్లి రోడ్డుపై నిలిచిపోతున్న వాహనాలు ట్రాఫిక్ అంతరాలు వెరసి నేలకొండపల్లి మండల కేంద్రంలో నిత్యం దర్శనమిస్తుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వార్త... ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు నేలకొండపల్లి బస్టాండ్ సమీపంలోని ఓ చర్చి వద్ద ఎదురుగా గ్రీన్ బెల్ట్ స్థలాన్ని కేటాయించినప్పటికీ కొందరు ఆక్రమించి న వ్యవహారంపై 2022 సంవత్సరంలో నేలకొండపల్లి గ్రామానికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అప్పటి జిల్లా కలెక్టర్ గౌతమ్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన నాటి కలెక్టర్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి పుల్లారావును విచారణకు ఆదేశించగా పరిశీలించిన డిపిఓ వాస్తవమేనని తేల్చి గ్రీన్ బెల్ట్ స్థలంగా పంచాయతీ సిబ్బందితో బోర్డును ఏర్పాటు చేశారు. అవినీతికి అలవాటు పడిన పంచాయతీ రాజ్ రెవిన్యూ అధికారులు అవేమీ పట్టించుకోకుండా ముగ్గురు చేతులు మారిన గాని స్పందించకపోవడం విశేషం. పైగా పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన బోర్డును సైతం తీసివేసిన దుస్థితి. ఈ విచారణ సందర్భంగా మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు సైతం గ్రామ పంచాయతీకి తీసిన గ్రీన్ బెల్ట్ జోను డిపిఓ కు వివరించడం జరిగింది. నేలకొండపల్లి -ఖమ్మం రోడ్ లోని బి.వి.ఆర్ కాంప్లెక్స్ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేస్తున్నారని అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు కాంప్లెక్స్ యజమాని పై ఫిర్యాదులు చేసిన నేపథ్యం ఉన్నదని తెలుస్తోంది. కానీ ఫిర్యాదు ఇచ్చింది మొదలు మంతనాలు సాగించి పాలక వర్గంలోని కొందరు షాపులను 9 కోట్ల రూపాయలకు చేజిక్కించుకున్నట్లుగా ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం 15 కోట్ల మేర ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి సెల్లార్ షాపులను నిర్మాణం చేసినట్లు ఇప్పటికీ అధికారులకు తెలిసినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం- కోదాడ రోడ్డుపై కాంప్లెక్స్ ముందు పార్కింగ్ స్థలం లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం జరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ వెంచర్ నిర్వాహకులు సీసీ రోడ్లు నిర్మించకుండా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయకుండా గ్రీన్ బెల్ట్ కు స్థలం వదలకుండా వెంచర్ పనులు చేస్తూ ప్లాట్లు అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు నాటి పంచాయతీ పాలకవర్గం సభ్యులు జిల్లా కలెక్టర్కు పంచాయతీరాజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు నామమాత్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ వెంచర్ నిర్వాహకుడు తక్కువగా గ్రీన్ బెల్ట్ స్థలమును వదిలి ఎటువంటి ఇంటి పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఓ వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యాలయం పక్కన వీడియోస్ క్వా ఠర్  సైతం దర్జాగా కబ్జా చేసి 100 గజాలు మాత్రమే రికార్డులలో ఉండేటట్లు పావులు కదిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు వ్యక్తి మరో రెండు చోట్ల కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కాగా ప్రజా అవసరాల కోసం వైద్య సేవలను అందించే మండల ప్రభుత్వ దవాఖాన సైతం నాలుగు వైపులా కబ్జా కోరల్లో చిక్కుకొని మౌనంగా రోధించడం రోత పుట్టిస్తున్నట్లు పలువురు స్థానికులతో పాటు రోగులు సైతంఆరోపిస్తున్నారు.

*పంజావిసరనున్న "హైడ్రా.".?
కాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని లో అక్రమ నిర్మాణాలు కబ్జాలకు పాల్పడిన సంస్థలపై వ్యక్తులపై హైడ్రా చర్యలు తీసుకుంటుండగా పాలేరు నియోజకవర్గంలోని నెలకొండపల్లి కబ్జారాయుళ్ల వెన్నులోవణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమమని తెలిసి
ఏదైనా చర్యలు చేద్దామంటే.. ఇన్నేళ్లు దర్జాను అనుభవించిన కబ్జారాయుల్లు ఎక్కడ చులకన అమ్ముతామోనని క్షణక్షణం భయం గుప్పెట్లో గడుపుతుండగా కొందరు అందరివి పోతే మాది పోతుంది అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది.

*సమగ్ర సమాచారంతో.. రేపటి వార్త కథనంలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి వ్యాపార ముసుగు..? గ్రీన్ బెల్ట్ ల ఎగవేత..? మరిన్ని అక్రమాలపర్వంపై... కూసుమంచి వెంచర్లో జరిగిన అవినీతిపై వార్తా కథనం..!
తెలంగాణ వార్త.... ప్రజాహితం నిరంతరం సమగ్ర సమాచారంతో...!!

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333