నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల  పరిరక్షణ  కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబు

Jun 25, 2025 - 19:04
 0  7
నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల  పరిరక్షణ  కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబు
నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల  పరిరక్షణ  కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: ఆలంపూర్ సీఐ రవి బాబు

జోగులాంబ గద్వాల 25 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,IPS   .  ఆదేశాల మేరకు కోదండపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోరవెల్లి గ్రామంలో  సాయంత్రం  5:30 గంటల నుండి 07:30 గంటల వరకు సీ ఐ రవి బాబు పర్యవేక్షణలో నలుగురు ఎస్సై లు ,25 మంది  సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మూడు పార్టీలుగా విడిపోయి సుమారు 200 ఇండ్లను తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరించి, వారిని పేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా, వారి వేలిముద్రలు తీసుకొని వారిపై గతంలో ఏదైనా నేరాలు ఉన్నాయా అనే విషయాన్ని చెక్  చెయ్యడం జరుగుతుందని అన్నారు.  సరైన పత్రాలు లేని 72 ( ద్విచక్ర వాహనాలు -64, త్రి విల్లర్ -06,  ట్రాక్టర్ లు-02) వాహనాలను స్వాధీనం చేసుకోవడం  జరిగింది. 


ఈ సందర్భంగా సి . ఐ మాట్లాడుతూ.... నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుసుకునేందుకు మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారా వంటి విషయాలు తెలుసుకెందుకు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వాహన దారులు తప్పకుండా అన్ని డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి కొత్త చట్టాలలో జరిమానాలు, శిక్షలు పెంచడం జరిగిందన్న విషయన్ని ప్రజాలు గ్రహించాలని అన్నారు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు ఆకర్షితులు అయి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు అనీ, ఎవరైన మదక ద్రవ్యాల ను  వినియోగించిన, సరపరా చేసిన పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో,  ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, యువకులు గుంపులు గా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన, ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాలు ఉండటం వల్ల ఎవరైనా దొంగతనాలు చేయడానికి అయినా, అమ్మాయిలను, మహిళలను వేధించాలన్న, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడానికి భయపడతారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సి ఐ తెలిపారు.  అలగే సైబర్ నేరాల పాట్ల జాగ్రత్తగా ఉండాలనీ, మొబైల్ ఫోన్స్ లను జాగ్రత్తగా వినియోగించాలని, చిన్న చిన్న తప్పులతో విలువైన డబ్బులను పోగొట్టుకోవద్దు అని, ఎవరైనా సైబర్ నేరాల కు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయలని లేదా లోకల్ పోలీస్ లను సంప్రదించాలని అన్నారు. అనంతరం పొక్సో కేసుల నమోదు, శిక్షలు , బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ పర్యవ్యాసనల గురించి,  ట్రాపిక్ రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో కోదండపూర్ ఎస్సై మురళీ, ఇటిక్యాల, ఉండవల్లి, ఆలంపూర్ ఎస్సై లు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333