నేడు ఆటోలు బంద్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు..
ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు..
తెలంగాణ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను కలిసి ఆటో బంద్‌కు సంబంధించి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ బంద్‌కు క్యాబ్‌లు, డీసీఎం, లారీ డ్రైవర్లు కూడా మద్దతు తెలిపారని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు..