నేటి బాలలే..రేపటి పౌరులు..విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
అడ్డగూడూరు 29 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం మండల న్యాయ సేవ అధికార సంస్థ(ఎమ్మెల్ఎస్ సి)రామన్నపేట ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య మాట్లాడుతూ..నేటి బాలలే భవిష్యత్తు దేశ సంపదని బాల్య వివాహాల నిర్మూలన,బాల కార్మిక వ్యవస్థ,బాలల హక్కుల పరిరక్షణ మన అందరి బాధ్యత అని అన్నారు.
మరియు 1098,100,108, 112,తదితర టోల్ ఫ్రీ నెంబర్ల గురించి అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం సీనియర్ అడ్వకేట్లు డేవిడ్,ప్యానల్ అడ్వకేటు కూనూరు శ్రీనివాస్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు వాహన చట్టాలు, పోక్సో, గంజాయి పై, అలాగే గుడ్ టచ్,బాడ్ టచ్, మానసిక, శారీరక వేధింపులు ఎదురైనప్పుడు విద్యార్థినీలు అనుసరించాల్సిన పద్ధతులు మెలకువలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.బాల్య వివాహాల నిర్మూలన కొరకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కల్పించడం జరిగింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచర్ల రాజ్య వర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అగ్రీ లీగలైడ్ క్లినిక్ కే.శ్రీశైలం, లీగల్ సర్వీస్ ప్రతినిధి కురిమేటి యాదయ్య, పాఠశాల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి విజయలక్ష్మి,స్థానిక సర్పంచ్ వాసం విష్ణువర్ధన్ రావు, ఏఏపిసి చైర్మెన్ చిత్తలూరి సరిత, పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు, మండల పరిధి పోలీసు అధికారులు, గ్రామపంచాయతీ కార్యవర్గం, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.